Tech Tip - Aadhaar: సింగిల్‌ క్లిక్‌తో ఆధార్‌ హిస్టరీ.. ఎలా చూడాలంటే?

Aadhaar History: మీకు తెలియకుండానే ఆధార్‌ కార్డ్‌ ఎక్కడెక్కడ వినియోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిపై ఓ లుక్కేయండి.

Updated : 17 Mar 2024 14:47 IST

Tech tip | ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా ప్రతి దానికి ఆధార్‌ కార్డ్‌ (Aadhaar) సమర్పించాల్సిందే. ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌ నెంబర్‌ ఇచ్చేస్తున్నాం. దీంతో ఈ కార్డ్‌ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో తెలియట్లేదు. వేరెవరైనా దీన్ని వినియోగిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. ఇలాంటి  విషయాలను తెలుసుకోవాలంటే మీ కార్డ్‌ హిస్టరీ తెలుసుకోవాలి. దీంతో ఆధార్‌ని మీ అనుమతి లేకుండా ఎవరైనా వినియోగించారో సులువుగా కనిపెట్టేయొచ్చు. ఇంకా ఎటువంటి మోసపూరిత చర్యలకైనా పాల్పడుతుంటే ఇట్టే తెలిసిపోతుంది. 

హిస్టరీ చూసేది ఇలా..

  • దీని కోసం ఉడాయ్‌ https://uidai.gov.in/en/ పోర్టల్‌కు వెళ్లాలి.
  • పైన ఎడమవైపు ఉన్న My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar servicesపై క్లిక్‌ చేయాలి.
  • కిందకు స్క్రోల్ చేసి Aadhaar Authentication History అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే లాగిన్‌ కోసం కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
  • అందులో లాగిన్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా, ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.
  • తర్వాత కనిపించే స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేయగానే Authentication History అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  • అక్కడ ALL ని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్‌ చేసుకొని Fetch Authentication History పై క్లిక్‌ చేయాలి.
  • ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని