Xiaomi: డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమి ఇండియా భాగస్వామ్యం
భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి ‘షియోమి’..డిక్సన్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీదారు షావోమీ దేశీయ మార్కెట్‌ను పెంచుకోవడానికి, ఎగుమతుల కోసం స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి డిక్సన్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి దాని పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థల ద్వారా ఒక కాంపోనెంట్ ఎకోసిస్టమ్‌ను సెటప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. డిక్సన్ నోయిడాలోని 3,20,000 చదరపు అడుగుల సదుపాయంలో ఆగస్టు-సెప్టెంబర్ నాటికి షావోమీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సప్లయ్ చైన్‌లో పవర్‌హౌస్‌గా మారేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా స్థానిక తయారీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ కంపెనీలను భారత్ ప్రోత్సహిస్తోంది. మొబైల్ ఖర్చులను తగ్గించడానికి ఫోన్ విడిభాగాలను స్థానికంగానే సేకరిస్తామని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Shama: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!