logo

పాఠశాలలో కత్తితో హల్‌చల్‌

ఓ వ్యక్తి కత్తితో పాఠశాలలో హల్‌చల్‌ చేసిన ఘటన బోథ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. బోథ్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలలో సుభాష్‌ మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తున్నాడు.

Published : 01 Feb 2023 07:03 IST

తుకారాంను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

బోథ్‌, న్యూస్‌టుడే : ఓ వ్యక్తి కత్తితో పాఠశాలలో హల్‌చల్‌ చేసిన ఘటన బోథ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. బోథ్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలలో సుభాష్‌ మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడి తండ్రి తుకారాం సోమవారం పాఠశాలలోకి కత్తి పట్టుకొచ్చి హల్‌చల్‌ చేశాడు. భయాందోళనలకు గురైన ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. సుభాష్‌ తల్లిదండ్రులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా కుమారుడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వేరే కార్మికులతో వంట చేయిస్తున్నామన్నారు. బియ్యం ప్రభుత్వం సరఫరా చేయగా మిగతా వస్తువులన్నీ తామే కొనిచ్చి వంట చేయిస్తున్నాం. ఎన్నిసార్లు అడిగినా ప్రధానోపాధ్యాయురాలు బిల్లులు చెల్లించటం లేదన్నారు. రూ.20,000 వరకు రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు అజ్గరున్నీసాను వివరణ కోరగా ఈ విషయంతో తనకు సంబంధం లేదన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు వారి ఖాతాలోనే జమ అవుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని