logo

వైభవంగా అక్కకొండ బ్రహ్మోత్సవాలు

అక్కకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

Published : 03 Feb 2023 04:48 IST

కొండ గుహలో పూజలందుకుంటున్న లక్ష్మీనృసింహుడు

కడెం, న్యూస్‌టుడే : అక్కకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పవిత్ర గోదావరి నదీతీరాన దిల్దార్‌నగర్‌ సమీపంలో ఉన్న ఆలయ ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం అవగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం అర్చకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలోని అర్చకబృందం ఘనంగా జరిపించారు. మొదట స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. కొండపై గుహలోఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి చిత్రపటంతో ఉన్న ఆలయ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఖానాపూర్‌ సీఐ అజయ్‌బాబుతోపాటు పలువురు స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. ఆలయకమిటీ వారు భక్తులకు అన్నదాన వితరణ చేశారు.

అయిదున జాతర, రథోత్సవం : అక్కకొండ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణిమ రోజు ఆదివారం(అయిదున) సాయంత్రం నుంచి జాతర ప్రారంభం అయి సోమవారం మధ్యాహ్నం వరకు సాగుతుంది. పౌర్ణిమరోజు అర్ధరాత్రి తర్వాత స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. పక్క జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చే భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయకమిటి అధ్యక్షుడు రాజరమేష్‌ గౌడ్‌, సభ్యులు పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఖానాపూర్‌నుంచి ఆలయం వరకు ఆర్టీసీ బస్సు నడుస్తోందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని