హిందూ సంఘటితంలో అందరూ భాగమవ్వాలి’
సమాజంలోని హిందువులందరినీ సంఘటితం చేసేందుకు అనేక సంస్థలు, సంఘాలు కృషి చేస్తున్నాయని వీటిలో ప్రతిఒక్కరూ భాగమవ్వాలని శివాజీ సేవాసమితి అధ్యక్షుడు మెడిసెమ్మె రాజు అన్నారు.
నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే: సమాజంలోని హిందువులందరినీ సంఘటితం చేసేందుకు అనేక సంస్థలు, సంఘాలు కృషి చేస్తున్నాయని వీటిలో ప్రతిఒక్కరూ భాగమవ్వాలని శివాజీ సేవాసమితి అధ్యక్షుడు మెడిసెమ్మె రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హిందువులు ఏకమైనప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని, లేకపోతే విచ్ఛిన్నమయ్యే ప్రమాదముందన్నారు. ధర్మ పరిరక్షణకు శివాజీ చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. శివాజీ పట్టాభిషేక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియం నుంచి అంబేడ్కర్ చౌక్ మీదుగా శివాజీచౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గొజ్జ జనార్దన్, వడ్లకొండ అలివేలు, పొలిశెట్టి విలాస్, దొముడాల ప్రవీణ్, రజినివైద్య, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్