logo

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం  మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్‌.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు.

Published : 29 Mar 2024 04:05 IST

గంపలగూడెం, రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం  మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్‌.శైలజ, ఎ.వీరరాజు గురువారం తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో మే 22వ వరకు దరఖాస్తులు చేయవచ్చన్నారు. 25న ఆదర్శ పాఠశాలల రాష్ట్ర జేడీ వెంకటకృష్ణారెడ్డి దరఖాస్తుల స్వీకరణకు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన విద్యాలయాల నుంచి పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులన్నారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయని, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తారని వెల్లడించారు. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారని, పది ఫలితాల అనంతరం వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారన్నారు. దరఖాస్తుతో పాటు ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.150లు రుసుం చెల్లించాలని చెప్పారు. http:///apms.ap.gov.in/apms/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నెలాఖరుతో ముగుస్తుందని, ఏప్రిల్‌ 21న ప్రవేశ అర్హత పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని