logo

దూసుకొస్తున్నాయ్‌.. జాగ్రత్తమ్మా!

రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు..

Updated : 29 Mar 2024 04:32 IST

వాహనాలు వస్తున్నా... రోడ్డు దాటేస్తూ, మరోవైపు ఆటో దిగుతూ..

రెప్పపాటులో దూసుకొచ్చే వాహనాలు.. ఆదమరచి రోడ్డుపైనే ఆడుకునే చిన్నారులు.. రోడ్డు దాటాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారిగా పరిగెత్తే విద్యార్థులు.. ఇవీ ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద కనిపించిన దృశ్యాలు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ పాఠశాలలో పెద్దసంఖ్యలో విద్యార్థులు అభ్యసిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పాఠశాలకు వెళ్లి, వచ్చేటప్పుడు రోడ్డు సగం వరకు వచ్చి ఆటోలు, బస్సుల కోసం నిలబడుతున్నారు. రోడ్డు దాటి అటువైపు కూడా వేచి చూస్తున్నారు. ఆటోల కోసం రోడ్డు అటు వైపు పరుగులుపెడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. బడి వదిలే వేళ ఇక్కడ ఒక కానిస్టేబుల్‌ను ఉంచి వాహనాల రాకపోకలను గమనించి విద్యార్థులను క్రమపద్ధతిలో రోడ్డు దాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈనాడు, అమరావతి

విద్యార్థులతో ఆటో ప్రమాదకరంగా డివైడర్‌ కటింగ్‌ వద్ద రోడ్డు దాటుతూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని