logo

పనులు చేశారా.. పైసలు మేశారా..!

ఎయిర్‌పోర్టు గ్రీన్‌ కారిడార్‌లో భాగంగా ఇటీవల విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు కూడలి దాకా సుమారు 13 కి.మీ జాతీయ రహదారిని అధికారులు అభివృద్ధి చేశారు.

Published : 17 Apr 2024 04:47 IST

నిడమానూరు వద్ద వంతెనపై పాదచారుల దారి దుస్థితి, ఎండుతున్న మొక్కలు

యిర్‌పోర్టు గ్రీన్‌ కారిడార్‌లో భాగంగా ఇటీవల విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు కూడలి దాకా సుమారు 13 కి.మీ జాతీయ రహదారిని అధికారులు అభివృద్ధి చేశారు. రూ.22కోట్లతో పచ్చదనం, ఫుట్‌పాత్‌లు, రోడ్డు పక్కన పేవర్‌ బ్రిక్స్‌, కాల్వల నిర్మాణాలు, గ్రానైట్‌ పనులు నాసిరకంగా చేశారు. దీంతో గూడవల్లి, నిడమానూరు, కేసరపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన వేసిన పేవర్‌ బ్రిక్స్‌, టైల్స్‌ కుంగిపోయి కనిపిస్తున్నాయి. బ్రిక్స్‌, టైల్స్‌ పోయినచోట మట్టి పోశారు. కొన్నిచోట్ల టైల్స్‌ చెదిరిపోయాయి. జాతీయ రహదారి అంచులు వంగిపోయి, పక్కన బ్రిక్స్‌ కుంగిపోయి గుంతలు పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రోడ్డు పక్కన అంచులకు కాంటూరు గట్లు వేయకపోవడంతో మట్టి కొట్టుకుపోయి.. మొక్కలు జారిపోయి ఎండిపోతున్నాయి. వైకాపా పాలనలో ఏపీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ వీఎంసీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ కారిడార్‌ పనుల్లో డొల్లతనం బయటపడుతుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, అమరావతి

పేవర్‌ బ్రిక్స్‌ చెదిరిపోతూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని