Suicide: బలవంతంగా చదవలేనని.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జీడిమెట్ల, న్యూస్‌టుడే: తనకు ఇష్టం లేని చదువును.. బలవంతంగా చదవలేనని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్‌నగర్ హనుమాన్ ఆలయం సమీపంలో నివాసముండే బాలుడు(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా.. తల్లిదండ్రులతో తనకు చదవడం ఇష్టం లేదని చెబుతున్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. ఈ క్రమంలోనే.. అతడు సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.