logo

సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి

సురవరం ప్రతాపరెడ్డ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్దా మురళి అన్నారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో ప్రముఖ....

Published : 28 May 2022 01:23 IST


మాట్లాడుతున్న బుద్దా మురళి, చిత్రంలో శ్రీమణి, అప్పారావు, కళాజనార్దనమూర్తి, లతావర్మ, గీతాదేవి

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: సురవరం ప్రతాపరెడ్డ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్దా మురళి అన్నారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో ప్రముఖ సంపాదకులు, పరిశోధకులు సురవరం ప్రతాపరెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డిదేనని పేర్కొన్నారు. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖులు శ్రీమణి, అప్పారావు, గీతాదేవి, లతావర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు