logo

చతికిలపది!

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గ్రేటర్‌ జిల్లాలు చతికిల పడ్డాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే రంగారెడ్డి జిల్లా 25వ స్థానంలో నిలవగా.. మేడ్చల్‌ జిల్లా 30వ స్థానం,

Updated : 01 Jul 2022 06:13 IST

రాష్ట్రంలో చివరి స్థానంలో హైదరాబాద్‌
మేడ్చల్‌కు 30.. రంగారెడ్డికి 25వ స్థానం
ఈనాడు, హైదరాబాద్‌

వీరంతా పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన సర్కారు బడి పిల్లలు..  

సీతాఫల్‌మండి ఉన్నత పాఠశాల వద్ద ఇలా సందడి చేస్తూ కనిపించారు.

దో తరగతి పరీక్ష ఫలితాల్లో గ్రేటర్‌ జిల్లాలు చతికిల పడ్డాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే రంగారెడ్డి జిల్లా 25వ స్థానంలో నిలవగా.. మేడ్చల్‌ జిల్లా 30వ స్థానం, హైదరాబాద్‌ జిల్లా చివరిగా 33వ స్థానం దక్కించుకుంది. మూడు జిల్లాల్లో కలిపి 1,64,082 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఇక్కడే పరీక్షలు రాశారు. వీరిలో 1,38,433 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 84.36 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. రాష్ట్ర ఉత్తీర్ణతతో పోల్చితే మూడు జిల్లాల్లోనూ తక్కువగా నమోదవ్వడం విశేషం. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 90శాతం దాటింది. మిగిలిన జిల్లాల్లో అంతకంటే తక్కువగానే నమోదైంది.

బాలికలే నిలబెట్టారు..! మూడు జిల్లాల్లో బాలురతో పోల్చితే బాలికలే అధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 93శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 87.31శాతానికి పరిమితమైంది. మేడ్చల్‌ జిల్లాలోనూ బాలికల ఉత్తీర్ణత శాతం 89.47శాతం ఉండగా.. బాలురు 83.42 శాతం పాసయ్యారు. హైదరాబాద్‌ జిల్లాలో పరీక్ష రాసిన వారి సంఖ్యలోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పరీక్ష రాశారు. ఇక ఉత్తీర్ణత శాతం పరంగానూ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 84.37గా ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 74.8 శాతానికే పరిమితమైంది.

జీపీఏ పరంగా...  గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) పరంగా మూడు జిల్ల్లాల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సాధించారు. 10/10కి జీపీఏ సాధించిన వారిలో ప్రభుత్వ బడులకుతోడు ప్రైవేటు పాఠశాలలు సైతం ఉన్నాయి. సుమారుగా 3300 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 1600 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారు. ఈ జిల్లాలోని కేజీబీవీల పరంగా కడ్తాల్‌లోని విద్యాలయానికి చెందిన బాలిక ఇ.అనూష 10/10 జీపీఏ సాధించింది. జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, మోడల్‌, ఎయిడెడ్‌, కేజీబీవీల పరంగా 31 మందికి పూర్తి గ్రేడ్‌ దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని