logo

బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య కన్నుమూత

బాలానగర్‌కు చెందిన బాలసాహితీవేత్త రెడ్డి రాఘవయ్య (82) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి తాలుకా ప్యాపర్రు గ్రామానికి చెందిన ఈయన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో పనిచేసి అసిస్టెంట్‌

Published : 26 Jul 2022 01:42 IST

బాలానగర్‌, న్యూస్‌టుడే: బాలానగర్‌కు చెందిన బాలసాహితీవేత్త రెడ్డి రాఘవయ్య (82) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి తాలుకా ప్యాపర్రు గ్రామానికి చెందిన ఈయన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో పనిచేసి అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా 2000వ సంవత్సరంలో పదవీ విరమణ పొందారు. ఈయన 9వ తరగతి నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపుతూ అప్పట్లో సలహా అనే పిల్లల కథను రాశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా బాలల గేయాలు, గేయకథలు, పాటకథలు, సైన్స్‌ కథలు.. ఇలా బాల సాహిత్యంపై 32 పుస్తకాలు రాశారు. ఈయన రాసిన చిరుదివ్వెలు పుస్తకానికిగాను 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. బాలసాహిత్యంలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 2003లో పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ ఉత్తమ బాలసాహిత్య అవార్డు ప్రదానం చేసింది. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోమవారం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో కుటుంబసభ్యులు రెడ్డి రాఘవయ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆయన మృతికి పలువురు రచయితలు శ్రద్ధాంజలి ఘటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని