logo
Published : 13 Aug 2022 02:02 IST

16న తాగునీటి సరఫరాకు అంతరాయం

కృష్ణా ఫేజ్‌-1 రిజర్వాయర్ల పరిధిలో 36 గంటలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరానికి నీటి సరఫరా చేస్తున్న కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్‌-1 పైపులైన్‌ అలియాబాద్‌ అప్‌టేక్‌ వద్ద కూడలి పనుల నిమిత్తం జలమండలి అధికారులు కృష్ణా ఫేజ్‌-1 పరిధిలోని కొన్ని రిజర్వాయర్ల పరిధుల్లో పాక్షికంగా తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఈ నెల 16 నుంచి 17 వరకూ 36గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. 

16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అంతరాయం కలిగే ప్రాంతాలు.

* మిరాలం, కిషన్‌బాగ్, అల్‌ జుబైల్‌ కాలనీ, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్‌ యాకుత్‌పుర, మాదన్నపేట, మహబూబ్‌ మాన్షన్, రియాసత్‌ నగర్, అలియాబాద్, బాలాపూర్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్, బొంగుళూరు, మన్నెగూడ. 

* నల్గొండ జిల్లాలోని గొడకొండ్ల ఉపకేంద్రం వద్ద విద్యుత్తు నియంత్రికలను ఈ నెల 16న మార్చనున్నారు. ఈ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాయం.

బాలాపూర్, మైసారం, బార్కాస్, శాస్త్రిపురం, బండ్లగూడ, మెహదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌస్, కాకతీయనగర్, హుమాయున్‌ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్, ఎంఈఎస్, షేక్‌పేట, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్‌ కాలనీ, భోజగుట్ట, చింతలబస్తీ, జియాగూడ, రెడ్‌హిల్స్, సెక్రటేరియట్, ఓల్డ్‌ ఎంఎల్‌ఏ క్వార్టర్స్, అల్లబండ. గగన్‌మహల్, హిమాయత్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్‌. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా. తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ. హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్, సాహెబ్‌నగర్, వైశాలినగర్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్, మహేంద్రహిల్స్, సైనిక్‌పురి, మౌలాలి.  వెలుగుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్రనగర్‌. గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరీ హిల్స్‌. మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్‌ నగర్, గోల్డెన్‌ హైట్స్, నైన్‌ నెంబర్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, ఎంఎం పహాడీ, చింతల్‌మెట్, కిషన్‌బాగ్, గంధంగూడ, మణికొండ, నార్సింగి, కిస్మత్‌పూర్, బోడుప్పల్, మల్లికార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్‌నగర్, పీర్జాదిగూడ. మీర్‌పేట, లెనిన్‌నగర్, బడంగ్‌పేట్, ధర్మసాయి. మన్నెగూడ, తుర్కయాంజాల్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని