logo

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్‌

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణిని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు.

Updated : 21 Mar 2023 06:12 IST

వినతులు స్వీకరిస్తున్న పాలనాధికారి నారాయణరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణిని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. ప్రజావాణిలో ఉన్నతాధికారులను కలిసి తమ గోడును వినిపించేందుకు సోమవారం బాధితులు తరలివచ్చారు. ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 398 అర్జీలను అధికారులు స్వీకరించారు. పాలనాధికారికి దరఖాస్తులను అందజేస్తూ పరిష్కారం చూపాలని కోరారు. శిక్షణ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌ అర్జీలను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ స్వీకరించిన దరఖాస్తులను వెంటనే సంబంధిత శాఖాధికారులకు అందజేసి పరిష్కరించాల్సిందిగా అదేశిస్తున్నామన్నారు.

పనిచేస్తున్న వీఆర్‌ఎలకు మాత్రమే వేతనాలు: జిల్లాలో పనిచేస్తున్న వీఆర్‌ఎలకు మాత్రమే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి తహసీల్దార్లను ఆదేశించారు. విధులకు హాజరు కాని వీఆర్‌ఎలకు జీతాలు నిలిపివేసి వారిపై తగు చర్యకై ఆర్డీఓలకు నివేదికలు పంపించాలని సూచించారు.


మున్సిపల్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో..

వికారాబాద్‌ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 16 అర్జీలను స్వీకరించామని పుర కమిషనర్‌ శరత్‌చంద్ర తెలిపారు. సోమవారం ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి రెవెన్యూ, ఇంజినీరింగ్‌ తదితరాలకు చెందిన అర్జీలను అందుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ తబిత, పట్టణ ప్రణాళికాధికారి శ్రీధర్‌, ఏఈ రాయుడు, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌ మోహియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని