ఎంఎంటీఎస్ ప్రయాణికులకు తాగు నీరు
నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ద.మ. రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. కరోనాకు ముందు ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించేవారు.
అన్ని స్టేషన్లలో ఆర్‌వో మినీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
ఈనాడు-హైదరాబాద్: నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ద.మ. రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. కరోనాకు ముందు ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించేవారు. లీటరు నీళ్లు రూ.5కే దొరికేవి. కరోనా తర్వాత ఆ ఒప్పందాలు రద్దయ్యాయి. ఎంఎంటీఎస్ స్టేషన్లలో కొనుక్కుందామన్నా నీరు దొరకని పరిస్థితి ఉండడంతో ఆర్‌వో ప్లాంట్ ద్వారా తాగు నీరు అందించేందుకు ద.మ.రైల్వే చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలో 26 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు పెద్దవి కనుక నీళ్ల సీసాలు దొరుకుతాయి. మిగతా 22 స్టేషన్లలో మినీ ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకవేళ అదీ సాధ్యం కాని పక్షంలో మెట్రో స్టేషన్లో మాదిరి 25 లీటర్ల క్యాన్ల ద్వారా తాగునీరు అందించాలని ప్రయత్నిస్తోంది. స్టాళ్లలో శీతల పానీయాలతో పాటు అల్పాహారం, తాగునీటి సీసాలు సైతం అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్