logo

సమష్టి కృషి.. పురస్కారంతో ఖుషీ

పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకుని పంచాయతీ పాలకులు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగి చీమలదరి గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిపారు.

Published : 01 Apr 2023 03:02 IST

వనంలో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు

న్యూస్‌టుడే. మోమిన్‌పేట: పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకుని పంచాయతీ పాలకులు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగి చీమలదరి గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిపారు. ఈ పల్లెలో 1,334 మంది జనాభా ఉన్నారు. అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాలను అమలు చేసి పురోగతికి బాట వేసుకున్నారు. వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డు, ప్రకృతివనం నిర్మించారు. పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు తీసుకోవడంతో  ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.

ఆకట్టుకునే ప్రకృతి వనం

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు సర్పంచి నర్సింహారెడ్డి ప్రత్యేక చొర¢వ చూపారు. ప్రకృతి వనంలో పూల మొక్కలతో పాటు, వివిధ రకాల వనమూలికలవి నాటారు. వనంలో ఉదయం నడకకు ఏర్పాట్లు చేయించారు.  వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ కోర్టులు, వ్యాయామ పరికరాలు, చిన్నారులు ఆడుకునేందుకు ఊయల, జారుడు బండలు ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా అండర్‌ డ్రైనేజ్‌ మురుగు కాలువలు నిర్మించారు.

గ్రామ సచివాలయం

సమస్యల పరిష్కారానికి నిధులు: సమస్యలపై గ్రామసభలు నిర్వహించి వాటి పరిష్కారానికి నిధులను వినియోగించారు. బాలకార్మికులను గుర్తించేందుకు, బాల్యవివాహాలను అడ్డుకునేందుకు కమిటీ ఏర్పాటు చేసి, బడిఈడు పిల్లలందరు పాఠశాలలో ఉండేలా చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, విద్య ప్రమాణాలు పెంపొందించారు. గ్రామ సమాచారం, పనుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచి జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేలా వెసులుబాటు కల్పించారు.

పకడ్బందీగా కార్యాచరణ: సుగుణ, కార్యదర్శి

మంజూరైన నిధులను వినియోగించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. సుపరిపాలనలో భాగంగా, ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంచాం.

అభివృద్ధే లక్ష్యం: సర్పంచి, నర్సింహారెడ్డి

ఆదర్శంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రభుత్వ నిధులతో పాటు, పల్లెకు వచ్చే ప్రతి ఆదాయాన్ని వెచ్చించాం. విద్యాభివృద్ధికి  దాతల సహకారంతో పాఠశాలలో వసతులు కల్పించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని