ప్రేమికుల మధ్య విభేదాలు.. బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య
ప్రేమించిన యువకుడి చేతిలో ఓ యువతి హత్యకు గురైందిన. బెంగళూరు నగర డీసీపీ డాక్టర్ భీమాశంకర్ గుళేద్ కథనం ప్రకారం.. జీవనబీమానగర పోలీసు స్టేషన్ పరిధి కోడిహళ్లిలో హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్(23) సోమవారం రాత్రి ఠాణా పరిధిలోని కోడిహళ్లిలో హత్యకు గురయ్యారు.

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: ప్రేమించిన యువకుడి చేతిలో ఓ యువతి హత్యకు గురైంది. బెంగళూరు నగర డీసీపీ డాక్టర్ భీమాశంకర్ గుళేద్ కథనం ప్రకారం.. జీవనబీమానగర పోలీసు స్టేషన్ పరిధి కోడిహళ్లిలో హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్(23) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు.
ఆకాంక్ష విద్యాసాగర్- దిల్లీకి చెందిన అర్పిత్ చాన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి కోడిహళ్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు. తాజాగా వారిద్దరూ వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిపాదన అర్పిత్‌కు ఆగ్రహం తెప్పించినట్లు గుర్తించారు. వేరుగా ఉండే విషయమై చాన్నాళ్లుగా ఇద్దరూ గొడవ పడుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సోమవారం రాత్రి ఆ ఇంట్లో వాదులాట అనంతరం ఆమె మెడకు చున్నీ చుట్టి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని డీసీపీ వివరించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అదనపు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ నిందితుడి కోసం పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..