logo

సాధారణ కార్యకర్తగా మొదలై రాష్ట్రస్థాయికి

కాంగ్రెస్‌, తెదేపాల్లో పలు హోదాల్లో పనిచేశారు. బాచుపల్లిలో సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్రస్థాయి వరకు సాగింది.

Published : 14 Mar 2024 01:58 IST
  • కాసాని జ్ఞానేశ్వర్‌
  • పార్లమెంట్‌ నియోజకవర్గం: చేవెళ్ల
  • స్వస్థలం: బాచుపల్లి(నిజాంపేట నగర పాలక సంస్థ)
  • చదువు: పదో తరగతి
  • వృత్తి: రాజకీయం
  • కుటుంబం: భార్య చంద్రకళ, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు  

నేపథ్యం: కాంగ్రెస్‌, తెదేపాల్లో పలు హోదాల్లో పనిచేశారు. బాచుపల్లిలో సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్రస్థాయి వరకు సాగింది. 1987లో కుత్బుల్లాపూర్‌ మండల ప్రజా పరిషత్తుకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఎంపీపీగా, 2001లో తెదేపా నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా, 2007లో అప్పటి తెరాస అసమ్మతి ఎమ్మెల్యేల సహాయంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2005లో 93 బీసీ కులాల ఐక్యవేదిక ఏర్పాటు చేసి రాష్ట్రంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2007లో ‘మన పార్టీ’ స్థాపించారు. 2009లో కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నుంచి ‘మన పార్టీ’ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2018లో మహాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్‌ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి ఓటమి చెందారు. 2022లో తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత ఏడాది నవంబరు 30న తెదేపాకు రాజీనామా చేసి అప్పటి సీఎం కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు.

న్యూస్‌టుడే, నిజాంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని