logo

కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్నారు: కొండా

గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించాయని చేవెళ్ల పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు.

Published : 30 Mar 2024 02:23 IST

కంకల్‌లో స్థానికులతో కలిసి చాయ్‌ తాగుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి

పరిగి, పరిగి గ్రామీణ, పూడూరు: గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించాయని చేవెళ్ల పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రజా ఆశిర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం పరిగి, పూడూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నడిచిన దారిలోనే, ప్రస్తుత సర్కారు నడుస్తోందని విమర్శించారు. కేంద్రం రూ. కోట్లు ఇస్తున్నా, ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనపై ప్రజల విశ్వాసం కోల్పోయిన కారణంగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. దేశ ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో మరింత దూసుకువెళ్లాలంటే నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతీ కిరణ్‌, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పరమేశ్వర్‌రెడి,్డ అసెంబ్లీ కన్వీనర్‌ నర్సింహ, గిరిజనమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్రావత్‌హరి, ఫిలింసెన్సార్‌ బోర్డు సభ్యుడు మల్లేష్‌ పటేల్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని