logo

పాతాళంలోకి పడిపోతున్నాయ్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రధాన నగరంతోపాటు శివార్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది.

Published : 30 Mar 2024 02:40 IST

మీటర్‌ నుంచి 5 మీటర్ల వరకు జలమట్టాల తగ్గుదల
వచ్చే రెండు నెలలూ నగరంలో కష్టమే
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రధాన నగరంతోపాటు శివార్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, మియాపూర్‌, మణికొండ తదితర ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే భూగర్భ జలాలు అడుగంటాయి. మీటర్‌ నుంచి 5 మీటర్ల లోపలకు వెళ్లినట్లు పీజోమీటర్లు లెక్కలు చెబుతున్నాయి. రానున్న రెండు నెలల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదర్‌గూడ, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో ఐదేళ్లలో ప్రతి వేసవిలో భూగర్భ జలాల తగ్గుదల కన్పించలేదని, ఈసారి ఇళ్లల్లో బోర్లు ఇప్పటికే ఎండిపోయినట్లు పలువురు వాపోతున్నారు.  గతేడాది తగినంత వానలు కురవక పోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం కన్పిస్తోంది. ప్రస్తుతం జలమండలి 559.81 ఎంజీడీల నీళ్లను సరఫరా చేస్తోంది. ఎక్కడక్కడ బోర్లు ఎండిపోవడంతో ఈ జలాలు సరిపోవడం లేదు. ఫలితంగా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు