logo

ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?

రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్‌, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు.

Updated : 23 Apr 2024 05:23 IST

చార్మినార్‌, బహదూర్‌పురలో   గరిష్ఠ నిష్పత్తిలో ఓటర్లు
ఓటరు నమోదులో లోపాలపై విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్‌, బహదూర్‌పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. ఇంటికి నలుగురిని గరిష్ఠ సగటుగా భావిస్తారు. కొన్ని సెగ్మెంట్లలో ఆరుగురు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈసీ ప్రకటించిన జాబితాలోని ఇంటి నంబర్లతో ఆ విషయం స్పష్టమైంది. నకిలీ ఇంటి నంబర్లు పెద్దఎత్తున వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది పాతబస్తీ పరిధిలో సుమారు 5 లక్షల ఓట్లను తొలగించడం గమనార్హం. ఓటర్ల నమోదులో బీఎల్‌ఓలు, ఏజెన్సీల నిర్లక్ష్యమూ కారణమని తెలుస్తోంది.

 సరిగా విచారించకుండానే.. ఓటరు నమోదుకు చేసుకున్న వివరాలను ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఏజెన్సీలను నియమించుకుంటారు. ఆన్‌లైన్‌లో వచ్చినవి బీఎల్‌ఓ విచారించి ఆమోదించాలి. కొందరు బీఎల్‌ఓ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను కంప్యూటర్‌ ఏజెన్సీలకు ఇవ్వడంతో అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి.
పాతబస్తీ నియోజకవర్గాల పరిధిలో.. జిల్లాలు, నియోజకవర్గాలు, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఇంటి నంబర్లను ఈసీ ప్రకటించింది. నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యను ఇంటి నంబర్లతో పోల్చినప్పుడు.. కొన్నిచోట్ల ఒక్కో ఇంట్లో సగటు ఓటర్ల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. పాతబస్తీ, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉంది. వందకుపైగా ఓటర్లున్న ఇంటి నంబర్లను గతంలో అధికారులు గుర్తించారు. నకిలీ ఓటరు కార్డులు జారీ అయ్యాయని రాజకీయపార్టీల నుంచి బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని