logo

ఆదివాసీలకు చేయూత అందించండి: సీఎస్‌

మన్యంలోని గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేయూతనందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు అందిస్తున్న వివిధ పథకాలపై ఐటీడీఏ పీఓ ఛాంబర్‌లో ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్‌, పీఓ ప్రతీక్‌జైన్‌, యూనిట్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు.

Published : 17 Apr 2024 03:04 IST

సీఎస్‌కు స్వాగతం పలుకుతున్న ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్‌

భద్రాచలం, న్యూస్‌టుడే: మన్యంలోని గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేయూతనందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు అందిస్తున్న వివిధ పథకాలపై ఐటీడీఏ పీఓ ఛాంబర్‌లో ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్‌, పీఓ ప్రతీక్‌జైన్‌, యూనిట్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు. సమావేశంలో సీఎస్‌ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రత్యేక బోధనతో పాటు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. అటవీ ఫలసంపద దళారుల పాలు కాకుండా చూడాలని ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో ఇప్పపూల నర్సరీలు ఏర్పాటు చేయాలని, తద్వారా గిరిజనులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. అధికారులు పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విధిగా తనిఖీ చేయాలన్నారు. పోడు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన నిత్యావసర సరకుల స్టాళ్లను పరిశీలించారు. తొలుత ఐటీడీఏకు వచ్చిన సీఎస్‌కు పీఓ ప్రతీక్‌జైన్‌ ఇప్పమొక్కను అందించి స్వాగతం పలికారు.

స్వాగతం పలికిన కలెక్టర్‌

బూర్గంపాడు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కలెక్టర్‌ ప్రియాంక అల మంగళవారం స్వాగతం పలికారు. సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో సీఎస్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. పోలీసులు ప్రధాన కార్యదర్శికి గౌరవ వందనం సమర్పించారు. స్వాగతం పలికిన వారిలో ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఎస్పీ రోహిత్‌రాజు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని