logo

టిఫా స్కానింగ్‌తో పేదలకు మెరుగైన వైద్యం

టిఫా స్కానింగ్‌ యంత్రంతో పేద గర్భిణులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 29 Nov 2022 02:56 IST

ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


టిఫా స్కానింగ్‌ యంత్రాన్ని ప్రారంభించి గర్భిణితో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, న్యూస్‌టుడే : టిఫా స్కానింగ్‌ యంత్రంతో పేద గర్భిణులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన టిఫా స్కానింగ్‌ యంత్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక్క వైద్య కళాశాల మాత్రమే ఉందన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాలకు వైద్య కళాశాలలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రాంకిషన్‌, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో డా.శశికాంత్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.జీవన్‌, గైనిక్‌ విభాగాధిపతి డా.రాధ, ఆర్‌ఎంవో డా.సిరాజొద్దీన్‌, సీహెచ్‌వో రామునాయక్‌, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


పాలమూరు బిడ్డలు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : విద్యార్థులను పరిశోధనలవైపు ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం క్రిస్టియన్‌పల్లి ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ బాల్‌ వైజ్ఞానిక్‌ ప్రదర్శిని 2022-2023, జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2021-2022కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం సరికాదన్నారు. పదో తరగతి వరకు పిల్లలకు తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వరాదన్నారు. అంతకుముందు అణుపితామహుడు హోమీ జహంగీర్‌ బాబా విగ్రహానికి రిమోట్‌తో పూలజల్లు కురిపించారు. ఫులే వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ నిజాంపాషా, జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రహమాన్‌, వైస్‌ ఛైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, సీసీకుంట జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, డీఈవో రవీందర్‌, జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు