logo

వైభవంగా మహా కల్యాణోత్సవం

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరాసనగండ్లలో రెండో భద్రాద్రిగా పేరొందిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల మహా కల్యాణోత్సవం నిర్వహించారు.

Published : 17 Apr 2024 15:22 IST

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరాసనగండ్లలో రెండో భద్రాద్రిగా పేరొందిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల మహా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఛైర్మన్ డేరం రామశర్మ ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణోత్సవానికి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ , ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజ్, భాజపా, భారాస ఎంపీ అభ్యర్థులు భరత్ ప్రసాద్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 250 మందితో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని