logo

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకం: కలెక్టర్‌

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకమని, 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమాన్ని ఆమె

Published : 26 Jan 2022 04:17 IST

కలెక్టరేట్‌లో సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను సన్మానించిన కలెక్టర్‌ పమేలా సత్పతి, చిత్రంలో
అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకమని, 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటుహక్కును సద్వినియోగం చేసుకొని సుస్థిరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడాలని కోరారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంటోందని, గ్రామాల్లో వృద్ధులు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారని తెలిపారు. పట్టణ యువత ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ ఏడాది 3,307 మంది నూతనంగా ఓటుహక్కు పొందారని చెప్పారు. అనంతరం ఉద్యోగులు, ఓటర్లతో ఓటరు బాధ్యతలు, ఓటుహక్కు విశిష్టతను తెలియజేసే ప్రతిజ్ఞ నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను కలెక్టర్‌ సన్మానించారు. నూతన ఓటర్లకు ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో భూపాల్‌రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయకుమారి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఎం.నాగేశ్వరచారి, జిల్లా ఎన్నికల కార్యాలయ సూపరింటెండెంట్‌ నాగలక్ష్మి, తహసీసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు బాలకృష్ణారెడ్డి, బీఎన్‌రెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని