logo

విశాఖ లోక్‌సభ స్థానానికి మూడు నామపత్రాలు

విశాఖ లోక్‌సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్‌, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు.

Published : 24 Apr 2024 04:21 IST

రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునకు నామపత్రాలు
అందజేస్తున్న సత్యనారాయణరెడ్డి , గండికోట రాజేష్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ లోక్‌సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్‌, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కేఏ పాల్‌ మరో సెట్‌ సమర్పించారు.  ఏఆర్‌ఓ, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నీ కాంగ్రెస్‌ అభ్యర్థి పి.సత్యనారాయణ రెడ్డి నామపత్రాలు సమర్పించిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. ఈనెల 28న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మే నెలలో అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారానికి విశాఖ వస్తారని తెలిపారు. ర్యాలీలో సీపీఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, దక్షిణం కాంగ్రెస్‌ అభ్యర్థి వాసుపల్లి సంతోష్‌, సీపీఐ అభ్యర్థి విమల, తదితరులు పాల్గొన్నారు. నీ కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరెడ్డి స్థిర,చరాస్తులు కలిపి రూ.59,39,092, అప్పులు రూ.10లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారు. పోలీసు కేసులు ఏమీ లేవు.

అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 నామ పత్రాలు: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 మంది అభ్యర్థులు మంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు. భీమిలి 2, తూర్పు 2, దక్షిణం 2, ఉత్తరం 5, పశ్చిమం 3, గాజువాక 2, పెందుర్తి 2 చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామపత్రాల దాఖలుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని