Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్‌ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!

లక్షద్వీప్‌కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్‌ డిగ్రీ ఛానెల్‌. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.

Updated : 09 Jan 2024 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: లక్షద్వీప్‌ (Lakshadweep) పర్యాటక అంశం తెలిసినప్పటి నుంచి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఆ దీవుల గురించి నెట్టింట సెర్చ్‌ చేస్తున్నారు. ఈ దీవులకు సంబంధించిన మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అదే నైన్‌ డిగ్రీ ఛానెల్‌ (Nine Degree Channel). భారత్‌ అధీనంలోని ఈ కీలక సముద్ర మార్గంలో ఎలాంటి అలజడి జరిగినా.. ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.

లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!

  • హిందూ మహాసముద్రంలోని ఈ సముద్ర మార్గం.. లక్షద్వీప్‌లోని కాల్పెనీ,  మినికోయ్‌ దీవులను వేరుచేస్తుంది.
  • అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం కీలకం. నిమిషానికి 11 ఓడలు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తాయి.
  • ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపాల నుంచి భారత్‌, దక్షిణాసియా, చైనా, ఆగ్నేయాసియాలకు ఈ మార్గం ప్రాణాధారం.
  • ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్తుండటం భారత్‌కు సముద్రమార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కలిగించింది.
  • మినికోయ్‌ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న యోచన కేంద్రానికి ఉంది. భవిష్యత్తులో ఇది మనకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తుంది.
  • చైనాతో భారీ స్థాయిలో ఘర్షణలు ఏర్పడితే.. ఈ మార్గాన్ని మూసివేస్తే డ్రాగన్‌ ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని