వాతావరణ మార్పులతో చదువుకు దూరం
వాతావరణ మార్పులు చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, దాని పరిష్కారానికి అత్యవసర వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడిచేసింది
ముంబయి: వాతావరణ మార్పులు చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, దాని పరిష్కారానికి అత్యవసర వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడిచేసింది. ‘ప్రొటెక్ట్ ఏ జనరేషన్: క్లైమేట్ సెక్యూరిటీ ఫర్ ఇండియాస్ చిల్డ్రన్’ శీర్షికన ఈ నివేదికను విడుదల చేసింది. సేవ్ ది చిల్డ్రన్ సీఈఓ బిడిశా పిళ్లై, పీడబ్ల్యూసీ గ్లోబల్ ఆఫీస్ ఫర్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ వైస్ ఛైర్మన్ జైవీర్ సింగ్ సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశారు.
‘వ్యవసాయం, తీరప్రాంత జీవనోపాధిపై ఆధారపడిన జనాభా(పిల్లలతో సహా)కు వాతావరణ మార్పుల కారణంగా అసమాన ప్రమాదం పొంచి ఉంది’ అని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే చిన్నారులు ఈ మార్పుల భారం భరిస్తారని, ఇది వారి మనుగడ, భద్రత, అభివృద్ధి వంటి వారి ప్రాథమిక హక్కును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. కాగా, వాతావరణ మార్పుల ప్రభావాలను అనుభవిస్తోన్న ప్రాంతాల గురించి సోదాహరణంగా వివరించింది.
* వ్యవసాయ ఉత్పాదకత క్షీణించడంతో దానిపై ఆధారపడిన పశ్చిమ బెంగాల్‌లోని మోరేనా, పురూలియా ప్రాంతాల్లోని కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ఆ కారణంగా ఆ ఇళ్లలోని చిన్నారులు చదువును మానేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
*మధ్యప్రదేశ్‌లోని ఖార్గావ్ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీరు లభ్యత లేకపోవడంతో.. అది పిల్లల్లో డీహైడ్రేషన్‌కు దారితీసింది.
కాగా, పిల్లల భద్రతను నిర్ధారించడానికి వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అమలు చేయాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఈ నివేదిక సూచనలు చేసింది. చిన్నారులపై చూపే ప్రభావాలను పరిష్కరించడానికి భారత్ సరైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్‌లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్‌లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్‌లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్‌లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్‌లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్‌కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్‌మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం