నేను దేశద్రోహినైతే..: దీప్‌ సిద్ధూ

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని, ఉద్రిక్తతలకు పాల్పడేలా వారిని రెచ్చగొట్టాడని తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబీ గాయకుడు దీప్‌ సిద్ధూ ఖండించారు

Updated : 29 Feb 2024 18:19 IST

ఆరోపణలపై వీడియో పోస్ట్‌ చేసిన నటుడు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని, ఉద్రిక్తతలకు పాల్పడేలా వారిని రెచ్చగొట్టాడని తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబీ గాయకుడు దీప్‌సిద్ధూ ఖండించారు. అల్లర్ల తర్వాత నుంచి కన్పించకుండాపోయిన సిద్ధూ.. గురువారం తెల్లవారుజామున సోషల్‌మీడియాలో పంజాబీ యాసలో మాట్లాడుతున్న వీడియో ఒకటి పోస్ట్‌ చేశారు. దేశద్రోహి అంటూ రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘నేను దేశద్రోహిని కాదు. ఎర్రకోట వైపునకు వెళ్తున్న రైతులకు నేను నాయకత్వం వహించలేదు. లక్షలమంది రైతులను రెచ్చగొట్టి వారిని తప్పుదోవ పట్టించానని వారు నాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను అలా చేస్తే మీరంతా నాయకులు ఎలా అవుతారు? నేను దేశద్రోహినైతే.. రైతు నాయకులు కూడా దేశద్రోహులే అవుతారు. దీప్‌ సిద్ధూకు ప్రజల మద్దతు లేదని గతంలో రైతు నేతలే అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తులు.. నేను లక్షల మందిని ఉద్రిక్తతలకు ప్రోత్సహించానని ఆరోపిస్తున్నారు. పాపులారిటీ లేని వ్యక్తి అంతమందికి ఎలా నాయకత్వం వహించగలడు’’ అంటూ సిద్ధూ దుయ్యబట్టారు. 

అయితే దీప్‌ సిద్ధూ ప్రస్తుతం ఎక్కడున్నారన్నది ఇంకా స్పష్టత లేదు. ఆయనతో పాటు అల్లర్లకు బాధ్యుడని భావిస్తున్న మరో వ్యక్తి లఖా సిధానా కోసం దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గాలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీప్‌ సిద్ధూను విచారించేందుకు సమన్లు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇవీ చదవండి..

దిల్లీ ఘటన: దీప్‌ సిద్ధూ ఎక్కడ?

దిల్లీ ఘటన: రైతు నేతలపై లుకౌట్‌ నోటీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని