Dwarka Expressway: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వ్యయం 14 రెట్లు పెరిగిందా..!

భారత్‌మాలా ఫేజ్‌ - 1 కింద చేపట్టిన ప్రాజెక్టుల వ్యయం విపరీతంగా పెరిగిందని కాగ్‌ పేర్కొంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే మార్గం వ్యయం ఏకంగా 14 రెట్లు పెరిగిందని వెల్లడించింది.

Published : 14 Aug 2023 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్‌ మాలా పరియోజన ఫేజ్‌-1 ప్రాజెక్టు కింద చేపట్టిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ (Dwarka Expressway) నిర్మాణ వ్యయం ఆమోదించిన దానికంటే దాదాపు 14 రెట్లు పెరిగినట్లు తేలింది. ఈ విషయాన్ని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. దిల్లీ-గురుగ్రామ్‌ మధ్య ఎన్‌హెచ్‌-48 నుంచి 14 లైన్ల రహదారిగా అభివృద్ధి చేసి రద్దీ తగ్గించేందుకు 2017లో ఈ ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల మంత్రుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ కమిటీ సదరు ప్రాజెక్టులో కిలోమీటర్‌ రహదారికి రూ.18.20 కోట్ల వ్యయానికి ఆమోదం తెలపగా.. వాస్తవంగా నిర్మాణానికి కిలోమీటరుకు  రూ.250.77 కోట్లు ఖర్చయినట్లు కాగ్‌ తెలిపింది.

హిమాచల్‌లో కుంభవృష్టి.. ఏడుగురి మృతి

దీనిలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇచ్చిన వివరణను కూడా కాగ్‌ ప్రస్తావించింది.‘‘ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను అతి తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లతో ఎనిమిది రోడ్ల నిర్మాణంగా విస్తరించాలని నిర్ణయించాం. రెండు రాష్ట్రాల మధ్య ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అన్న విషయాన్ని వ్యయం పెరగడానికి కారణంగా పేర్కొన్నట్లు తెలిపింది. రోజువారీగా 55,432 ప్యాసింజర్‌ వాహనాల ప్రయాణిస్తాయనే  లెక్కతో నిర్మించిన ఎనిమిది లైన్ల నిర్మాణానికి ప్లానింగ్‌ లేదని పేర్కొంది. ఇదొక్కటే కాదని.. దేశ వ్యాప్తంగా భారత్‌మాలా పరియోజన కింద నిర్మించిన ప్రాజెక్టుల్లో చాలా వరకు ఆమోదం పొందిన వ్యయం కంటే 58 శాతం అధికంగా ఖర్చయ్యాయని వెల్లడించింది. దీంతోపాటు ప్రాజెక్టుల్లో చాలా మార్పులు చోటు చేసుకోవం కూడా ఖర్చు పెరగడానికి కారణంగా నిలిచిందని కాగ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని