న్యాయవ్యవస్థ సమూలంగా మారాలి
‘‘వివాదాల సంక్లిష్టత సమస్యను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ కేవలం సంప్రదాయ మార్గాల మీద ఆధారపడితే సరిపోదు. సమూల మార్పులతో కొత్తగా ముందుకు రావాలి’’ అని సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేశ్ మేనన్ అన్నారు.
సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేశ్ మేనన్
దిల్లీ: ‘‘వివాదాల సంక్లిష్టత సమస్యను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ కేవలం సంప్రదాయ మార్గాల మీద ఆధారపడితే సరిపోదు. సమూల మార్పులతో కొత్తగా ముందుకు రావాలి’’ అని సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేశ్ మేనన్ అన్నారు. భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జస్టిస్ మేనన్ ప్రసంగిస్తూ.. ‘‘న్యాయవ్యవస్థ విఫలమైతే వ్యవస్థ కుప్పకూలుతుంది. సంక్షోభాలను మనం విజయవంతంగా ఎదుర్కొంటే సమాజానికి మార్గనిర్దేశం చేయవచ్చు’’ అని అన్నారు. అపారమైన కేసుల భారం ఉండే భారత్‌లో న్యాయమూర్తులు ఎక్కువ శ్రమిస్తుంటారని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడుతూ.. భారత సుప్రీంకోర్టు చరిత్ర అంటే.. భారతీయుల దైనందిన పోరాట చరిత్రే అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్