ప్రపంచ వర్తమానం, భవిష్యత్తూ భారత్‌

ప్రపంచ వర్తమానం, భవిష్యత్తూ భారతేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారు. ప్రబల ఆర్థికశక్తిగా భారత్‌ ఎదుగుతోందంటూ కీర్తించారు.

Published : 24 Sep 2023 05:36 IST

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా

దిల్లీ: ప్రపంచ వర్తమానం, భవిష్యత్తూ భారతేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారు. ప్రబల ఆర్థికశక్తిగా భారత్‌ ఎదుగుతోందంటూ కీర్తించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. డిజిటల్‌ పేమెంట్‌ విధానం వాడుకలోనూ, కక్షిదారులకు వారి గుమ్మం వద్దే న్యాయం అదించడంలో ప్రపంచానికి భారత్‌ నేతృత్వం వహిస్తోందని తెలిపారు. దీనికి ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్‌ దోహదం చేస్తోందన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023లో శనివారం ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో 21 వేల జిల్లా కోర్టులు, 25 హైకోర్టులు, సుప్రీంకోర్టు ఉన్నాయని ఆయా న్యాయస్థానాలకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ డిజిటైజడ్‌ ఫార్మేట్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని