Tamil Nadu: బస్సు డ్రైవర్ ఆదర్శం.. విధి నిర్వహణలో ఉన్నా ఓటేయడం మరువలేదు..!

తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

Published : 19 Feb 2022 18:37 IST

చెన్నై: తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ధర్మపురి జిల్లాలోని బొమ్మిడి ప్రాంతానికి చెందిన శ్రీధర్.. శ్రీ విజయలక్ష్మి ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా.. పాలక్కాడ్ నుంచి సేలంకు బస్సులో ప్రయాణికులను తీసుకెళుతున్నాడు. సరిగ్గా తన సొంత ఊరు బొమ్మిడికి రాగానే రోడ్డు పక్కనే బస్సు ఆపిన శ్రీధర్.. ఓటు వేసి పది నిమిషాల్లో వస్తానని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాడు. వారు అందుకు అంగీకరించారు. పరిగెత్తుకుంటూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన శ్రీధర్.. ఓటు వేసి వచ్చి మళ్లీ స్టీరింగ్ అందుకున్నాడు. విధి నిర్వహణలోనూ ఓటు వేసినందుకు డ్రైవర్‌ను ప్రయాణికులందరూ అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని