Aadikeshava: అందుకు భయపడ్డాం.. ట్రైలర్‌తో సమాధానమివ్వబోతున్నాం: ‘ఆదికేశవ’ దర్శకుడు

హీరో వైష్ణవ్‌ తేజ్‌, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఆదికేశవ’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

Updated : 16 Nov 2023 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘ఆదికేశవ’ (Aadikeshava). ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌, హీరో ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఆదికేశవ’ గ్లింప్స్‌ విడుదలైన సమయంలో నెట్టింట జరిగిన చర్చపై స్పందించారు. ‘‘ఇది ఆలయాన్ని సంరక్షించే హీరో స్టోరీ కాదు. ఈ సినిమా కథలో అంతర్లీనంగా శివుడి గురించి ప్రస్తావించాలనుకున్నాన్నంతే. ఇందులో టెంపుల్‌కు సంబంధించిన సన్నివేశాల నిడివి పది నిమిషాలకంటే తక్కువే ఉంటుంది. ఈ దృశ్యాలతో కూడిన గ్లింప్స్‌తో ప్రచారం మొదలు పెడితే బాగుంటుందని భావించి విడుదల చేశాం. అయితే, దాన్ని చూసి కొందరు ‘ఆచార్య’ (చిరంజీవి హీరోగా తెరకెక్కింది) చిత్రంతో పోల్చినప్పుడు కాస్త భయపడ్డాం. ఈ సినిమాని వేరే కోణంలో చూస్తున్నారనిపించింది. ఈ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్‌తో సమాధానం ఇవ్వబోతున్నాం’’ అని శ్రీకాంత్‌ తెలిపారు.

చిరంజీవి కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం..: దర్శకుడు వశిష్ఠ

హీరోగా వైష్ణవ్‌ తేజ్‌కు ఇది 4వ సినిమా. ఇందులో రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌. మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 17న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ‘స్వామి రారా’, ‘కేశవ’ తదితర సినిమాల దర్శకుడు సుధీర్‌ వర్మ వద్ద సహాయకుడిగా పనిచేశారు శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి. ముందుగా మంచు మనోజ్‌ హీరోగా ‘అహం బ్రహ్మస్మి’ సినిమాని ప్రకటించారు. ఈలోగా ‘ఆదికేశవ’ను తెరకెక్కించారు. ‘అహం బ్రహ్మస్మి’ తప్పక తెరకెక్కిస్తానని కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో శ్రీకాంత్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని