Trisha: త్రిషకు మన్సూర్ అలీఖాన్‌ క్షమాపణ.. పోస్ట్‌ పెట్టిన నటుడు

నటి త్రిష (Trisha)కు నటుడు మన్సూర్ అలీఖాన్‌ (Mansoor Ali Khan) క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

Updated : 24 Nov 2023 15:44 IST

చెన్నై: నటి త్రిష (Trisha)పై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan).. తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడుద్దేశం లేదన్నాడు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మన్సూర్‌ పోస్ట్‌పై త్రిష పరోక్షంగా స్పందించారు. ‘‘తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’’ అని తాజాగా ఆమె ట్వీట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే..?

మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నాడు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

రష్మిక - విజయ్ దేవరకొండ.. లైవ్‌లో సీక్రెట్ చెప్పిన రణ్‌బీర్‌.. నటి షాక్

మరోవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా, త్రిషకు తాను క్షమాపణలు చెప్పనని తొలుత మన్సూర్ ఓ ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అతడు వెనక్కి తగ్గి తాజాగా క్షమాపణలు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని