Lavanya Tripati: వైజాగ్‌ బీచ్‌ క్లీనింగ్‌లో లావణ్య త్రిపాఠి

నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వైజాగ్‌లో సందడి చేశారు. బీచ్‌ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published : 28 Jan 2024 15:57 IST

హైదరాబాద్‌: తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖపట్నంలో సందడి చేశారు నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati). జాతీయ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. వైజాగ్ అంటే నాకెంతో ఇష్టం. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను ఇక్కడే షూట్‌ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రసారం కానున్న ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ను వీక్షించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని