Trisha Krishnan: చర్చనీయాంశంగా త్రిష పోస్ట్‌.. పెళ్లి వార్తల గురించేనా..?

కోలీవుడ్‌ నటి సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ నెటిజన్లను సందేహంలో పడేసింది. ఆమె తన పోస్ట్‌లో ఏం రాశారంటే?

Updated : 21 Sep 2023 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి త్రిష (Trisha Krishnan) సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పెట్టిన తాజా పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా సమాధానం ఇవ్వడంతో ఏం జరిగిందన్న సందేహం నెటిజన్లలో నెలకొంది. ‘‘డియర్‌.. నువ్వేంటో, నీ టీమ్‌ ఏంటో నీకు తెలుసు’. రూమర్స్‌ ఆపండి’’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోనున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. సోషల్‌ మీడియాలో సంబంధిత పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ఇవి త్రిష దృష్టికి వెళ్లగా ఆమె స్పందించారని కొందరు అభిమానులు అభిప్రాయపడగా.. సినిమాల విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్న పీఆర్‌ టీమ్ గురించి ఇలా పరోక్షంగా పోస్ట్‌ పెట్టారంటూ కోలీవుడ్‌ మీడియా పేర్కొంది. ఎవరినుద్దేశించి ఆ కామెంట్‌ చేశారో త్రిషకే తెలియాలని పలువురు నెటిజన్లు అన్నారు. త్రిష పెళ్లి విషయంలో రూమార్స్‌ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఆమె వివాహం గురించి ఊహాగానాలు వచ్చాయి. ఓ సందర్భంలో వాటిపై స్పందిస్తూ.. అవన్నీ వదంతులంటూ ఖండించారు. ఫోకస్‌ అంతా సినీ కెరీర్‌పైనే ఉందని, ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని త్రిష తెలిపారు.

మల్టీప్లెక్స్‌లో రూ. 99కే సినిమా టికెట్‌.. ఆఫర్‌ ఆ ఒక్క రోజే!

కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లుపైగానే అవుతున్నా ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు త్రిష. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన ఆమె త్వరలో ‘లియో’ (Leo)తో సందడి చేయనున్నారు. విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం  అక్టోబరు 19న విడుదల కానుంది. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘ది రోడ్‌’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు, ‘రామ్‌: పార్ట్‌ 1’లో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) సరసన త్రిష నటిస్తున్నారు. ‘ఐడెంటిటీ’ (Identity), మరో రెండు తమిళ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని