Adah Sharma: కమల్‌ హాసన్ వ్యాఖ్యలపై స్పందించిన అదా శర్మ.. ఏమన్నారంటే..!

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)పై అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ గతంలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా అదాశర్మ స్పందించింది.

Updated : 14 Jul 2023 10:58 IST

హైదరాబాద్‌: అదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి కోట్లు రాబట్టింది. అయితే.. ఈ సినిమా ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచే ఎంతోమంది దీనిపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌ ( Kamal Haasan), నసీరుద్దీన్‌ షా (Naseeruddin Shah)లు కూడా బహిరంగంగానే విమర్శించారు. తాజాగా వారి వ్యాఖ్యలపై అదా శర్మ స్పందించింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ది కేరళ స్టోరీ’ని విమర్శించిన వారిలో చాలామంది కనీసం దానిని చూడకుండానే కామెంట్స్‌ చేశారు. ఎన్నో విమర్శలు చేశారు. కానీ నేనేం బాధపడలేదు. మనదేశంలో ఉన్న వాక్‌ స్వేచ్ఛకు చాలా సంతోషించాను. ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. ఇక్కడ భిన్నమైన అభిరుచులు ఉన్న వ్యక్తులు ఉన్నారు. అదే మన దేశంలో ఉండే అద్భుతమైన విషయం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను’’ అని చెప్పింది.

కాగా గతంలో కమల్‌ హాసన్‌ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)గురించి మాట్లాడుతూ తనకు ప్రచార చిత్రాలంటే నచ్చవని అన్నారు. అలాంటి వాటికి తాను పూర్తిగా వ్యతిరేకినని చెప్పారు. సినిమా టైటిల్‌ కింద ‘నిజమైన కథ’ అని రాయగానే సరిపోదని.. అలా రాసినంత మాత్రాన అది నిజంగా జరిగిన కథ అవ్వదని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సినిమా విడుదల సమయంలో కమల్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని