Adikeshava: వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’.. కొత్త విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. ఆగస్టు 18న విడుదలకావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిత్ర బృందం కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించింది.

Published : 18 Aug 2023 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) హీరోగా రూపొందుతోన్న ‘ఆదికేశవ’ (Adikeshava) కొత్త విడుదల తేదీ శుక్రవారం ఖరారైంది. నవంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాని ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.

బాలీవుడ్‌లో షారుక్‌ చేసే రాజకీయాలు నచ్చవు: వివేక్ అగ్నిహోత్రి

యాక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ గుడి చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. వైష్ణవ్‌తేజ్‌.. రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన శ్రీలీల సందడి చేయనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్యారిస్‌లో ఇటీవల ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోలోని వైష్ణవ్‌ యాక్షన్‌, హీరోయిన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు