IMDb: ఐఎండీబీ టాప్‌ 250 ఇండియన్‌ సినిమాల్లో అడివి శేష్‌, మహేష్‌ బాబు రికార్డు

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ (IMDb) ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ను ప్రకటించింది. అందులో అడివి శేష్ నటించిన మూడు చిత్రాలు ఉండడం విశేషం.

Updated : 25 Dec 2023 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ను రూపొందించింది. సోషల్‌ మీడియా వేదికగా ఆ వివరాలు పంచుకుంది. ఇందులో టాలీవుడ్‌ నుంచి పలు సినిమాలు చోటుదక్కించుకోగా.. యంగ్‌ హీరో అడివి శేష్‌ నటించిన మూడు సినిమాలకు స్థానం దక్కడం విశేషం. అడివి శేష్ హీరోగా 2016లో విడుదలైన ‘క్షణం’ 159వ స్థానంలో నిలవగా.. 2019లో రిలీజైన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎవరు’ 165లో నిలిచింది. అలాగే గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన ‘మేజర్‌’ 176వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 142వ స్థానంలో మహేష్‌ అతడు ఉంది. పోకిరి 221వ ప్లేస్‌లో ఉండగా, ఒక్కడు 223వ స్థానంలో నిలిచింది. దీంతో ఈ లిస్ట్‌లో ఉన్న మూడు సినిమాల్లో నటించిన ఏకైక హీరోలుగా అడివి శేష్, మహేష్ బాబు రికార్డు నెలకొల్పారు. 

ఇక డిసెంబరు 25 నాటికి ఐఎండీబీ (IMDb) ప్రకటించిన ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’ (IMDb Top 250) జాబితాలో ఉన్న టాలీవుడ్‌ సినిమాలు ఏఏ స్థానాల్లో నిలిచాయంటే.. కేరాఫ్‌ కంచరపాలెం (14). జెర్సీ (20), మాయాబజార్‌ (23), సీతారామం (26), నువ్వు నాకు నచ్చావ్‌ (37), ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (50), మహానటి (53), బాహుబలి 2 (108), బొమ్మరిల్లు (127), రంగస్థలం (136), అతడు (142), పెళ్లిచూపులు (149), వేదం (184), బాహుబలి (191), అర్జున్‌ రెడ్డి (200), పోకిరి (221), ఒక్కడు (223), ఊపిరి (228), మనం (230), లీడర్‌ (234), ఆర్‌ఆర్‌ఆర్‌ (237), హ్యాపీడేస్‌ (241) స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని