Akshay Kumar: బాలీవుడ్‌ నుంచి రూ.3000కోట్లు రాబట్టే సినిమాలొస్తాయని ఆశిస్తున్నా..!

బాలీవుడ్‌ సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టడంపై హీరో అక్షయ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే హాలీవుడ్‌ తరహా సినిమాలు తెరకెక్కాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Published : 06 Oct 2023 18:54 IST

ముంబయి: ఈ ఏడాది బాలీవుడ్‌ నుంచి విడుదలైన సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. అన్ని సినిమాలు అగ్ర హీరోలవి కావడంతో బీటౌన్‌లో కాసుల వర్షం కురిసింది. ‘పఠాన్‌’ మొదలుకొని ‘ఓ మైగాడ్‌ 2’, ‘గదర్‌ 2’ తాజాగా ‘జవాన్‌’ ఇలా అన్ని సినిమాలు కమర్షియల్‌గా హిట్‌ను అందుకున్నాయి. ఈ కలెక్షన్ల గురించి అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) మాట్లాడుతూ త్వరలోనే హాలీవుడ్‌ తరహా సినిమాలు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఇటీవల ఓ కార్యక్రమంలో కలెక్షన్ల గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం వస్తున్న సినిమాల కథలు చాలా కొత్తదనంతో ఉంటున్నాయి. వాటికి రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ. అందుకే ప్రతి సినిమా రూ.1000కోట్ల బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసుకోవాలి’ అని అన్నారు. ఇదే వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘ఇండస్ట్రీ నుంచి మరిన్ని హిట్‌ సినిమాలు రానున్నాయి. తాజాగా ‘జవాన్‌’ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కొవిడ్‌ కారణంగా బాలీవుడ్‌ చాలా కష్టాలు ఎదుర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.1000కోట్ల బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. త్వరలోనే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ తరహాలో రూ.3000 కోట్లు వసూళ్లు చేసే సినిమాలు రావాలని ఆశిస్తున్నా. అంతగొప్ప స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్‌ ఇక్కడ ఉన్నాయి’’ అని అన్నారు. 

రివ్యూ: రూల్స్‌ రంజన్‌.. కిరణ్ అబ్బవరం మూవీ హిట్టా..? ఫట్టా..?

అలాగే తన తాజా చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’(Mission Raniganj) గురించి మాట్లాడుతూ.. అది ‘జవాన్‌’, ‘రౌడీ రాథోడ్‌’లాంటి సినిమా కాదన్నారు. తక్కువ బడ్జెట్‌తో తీసిన చిత్రమని మంచి వసూళ్లు సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని