Pushpa: ‘పుష్ప’గా అల్లు అర్జున్‌ ఎలా మారాడో చూశారా?

‘‘ఇప్పటి వరకూ పుష్పలోని ఫైర్‌నే చూశారు.. మరి ‘పుష్ప’లా కనిపించేందుకు అల్లు అర్జున్‌ ఎంత ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారో చూడండి’’ అంటూ తాజాగా ఆ  చిత్రబృందం ఓ వీడియోని విడుదల చేసింది. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో మునుపెన్నడూ లేనివిధంగా రఫ్‌లుక్‌లో కనిపించారు.

Updated : 09 Feb 2022 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ఇప్పటి వరకూ పుష్పలోని ఫైర్‌నే చూశారు.. మరి ‘పుష్ప’లా కనిపించేందుకు అల్లు అర్జున్‌ ఎంత ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారో చూడండి’’ అంటూ తాజాగా ఆ  చిత్రబృందం ఓ వీడియోని విడుదల చేసింది. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో మునుపెన్నడూ లేనివిధంగా రఫ్‌లుక్‌లో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా  పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో బన్ని కనిపించారు. ముఖ్యంగా ఈ పాత్ర లుక్స్‌కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చిత్ర ప్రచార కార్యక్రమంలో బన్ని మేకప్‌ గురించి ప్రత్యేకించి మాట్లాడారు. ‘‘ ఇందులో రఫ్‌ లుక్‌లో కనిపించేందుకు సుమారు రెండు గంటలపాటు మేకప్ కోసమే కేటాయించాల్సి వచ్చేది. తెల్లవారుజామున 4.30కు నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొవాలి. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేది  చక్కగా సిద్ధం చేయడానికి మేకప్‌ బాయ్స్‌ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో నటీనటులు కేవలం ముఖానికి మాత్రమే కాకుండా చాలా షాట్స్‌లో శరీరానికి కూడా మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించారు. 50రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లు వసూలు చేసిందంటూ ఇటీవలే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్ని ‘పుష్ప: ది రూల్‌’లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని