Amala: ‘ఏజెంట్‌’ ట్రోలింగ్‌పై అమల పోస్ట్‌

అఖిల్‌ (Akhil) నటించిన ‘ఏజెంట్‌’ (Agent) సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు నటి అమల (Amala).ఈ చిత్రాన్ని తాను ఎంతగానో ఎంజాయ్‌ చేసినట్లు చెప్పారు.

Published : 29 Apr 2023 17:33 IST

హైదరాబాద్‌: తన తనయుడు అఖిల్‌ (Akhil) నటించిన రీసెంట్‌ సినిమా ‘ఏజెంట్‌’ (Agent)పై వస్తోన్న విమర్శల గురించి నటి అమల (Amala) స్పందించారు. అభద్రతాభావంతోనే ట్రోల్స్‌ పుట్టుకువస్తాయని చెప్పిన ఆమె.. ఏదైనా సాధించడానికి అవి అవసరమేనని తెలిపారు.

‘‘నిన్న ‘ఏజెంట్‌’ సినిమా చూశాను. సినిమాను ఆద్యంతం ఎంజాయ్‌ చేశాను. ఈ సినిమాలో లోపాలు ఉన్నప్పటికీ ఓపెన్‌ మైండ్‌తో చూస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. నేను సినిమా చూసిన థియేటర్‌ మహిళా ప్రేక్షకులతో నిండిపోయింది. యువతులు, మహిళలు, వృద్ధులు.. తమ కుటుంబసభ్యులతో వచ్చి సినిమాను చూస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌ వచ్చినప్పుడు వాళ్లు ఆనందంతో కేకలు వేశారు. దీని తర్వాత రానున్న సినిమా మరింత ఉన్నతంగా, ఉత్తమంగా ఉంటుందని నమ్ముతున్నా’’ అని అమల పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘ఏజెంట్‌’ రూపుదిద్దుకుంది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. మమ్ముట్టి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా తాము ఆశించినంతగా లేదని సినీ ప్రియులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమల ఈ పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని