Amitabh Bachchan: ఆరాధ్య స్టేజ్‌ షో.. అమితాబ్‌ ఫిదా..!

తన మనవరాలు ఆరాధ్య (Aaradhya) నటనకు ఫిదా అయ్యారు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan). ఆమెను మెచ్చుకుంటూ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

Updated : 17 Dec 2023 12:20 IST

ముంబయి: స్కూల్‌ వార్షికోత్సవంలో భాగంగా తన మనవరాలు ఆరాధ్య బచ్చన్‌ (Aaradhya Bachchan) ఇచ్చిన ప్రదర్శన చూసి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మురిసిపోయారు. ఆరాధ్యను మెచ్చుకుంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా తన బ్లాగ్‌లోనూ రాసుకొచ్చారు. ఆమె నటన సహజంగా ఉందని.. ఈ ప్రదర్శన పట్ల తమ కుటుంబం అంతా గర్వం, ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి.

Lokesh Kanagaraj: లోకేశ్‌ కనగరాజ్‌ ఆఫర్‌.. నో చెప్పిన షారుక్‌..?

బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ల పిల్లలు ముంబయిలోని ‘ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పాఠశాల వార్షికోత్సవం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇందులో భాగంగా తమ పిల్లల ప్రదర్శన ప్రత్యక్షంగా చూసేందుకు బాలీవుడ్‌ స్టార్లు ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, కరీనాకపూర్‌, కరణ్‌ జోహార్‌ తదితరులు తరలివచ్చారు. తమ పిల్లల కార్యక్రమాలు చూసి వారు మురిసిపోయారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆరాధ్య స్టేజ్‌ షోను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆమె డైలాగ్స్‌ చెప్పిన విధానం.. సందర్భానుసారం పలికించిన హావభావాలు.. డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు మెచ్చుకొంటున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని