Anupama Parameswaran: నేను ప్రేమలో ఉన్నా: అనుపమ

‘ప్రేమమ్‌’తో తెలుగువారికి చేరువైన కేరళ కుట్టీ అనుపమ. తొలి చిత్రంతోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడవారిని అలరిస్తున్నారు....

Published : 30 May 2022 10:24 IST

రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై నటి కామెంట్స్‌

హైదరాబాద్‌: ‘ప్రేమమ్‌’తో తెలుగువారికి చేరువైన కేరళ కుట్టీ అనుపమ. తొలి చిత్రంతోనే కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం ‘18 పేజీస్‌’, ‘కార్తికేయ 2’, ‘బటర్‌ఫ్లై’ చిత్రాల్లో నటిస్తున్న అనుపమ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటానని అన్నారు.

‘‘నాకు ప్రేమ వివాహంపై సదాభిప్రాయం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాక్కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలని ఉంది. మా ఇంట్లో వాళ్లకి కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లి చేసుకుంటే అది తప్పకుండా ప్రేమ పెళ్లే అవుతుంది’’ అని అనుపమ చెప్పంది. ‘‘ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా? లేదా సింగిల్‌గానే ఉన్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నేను సింగిల్‌.. కాదు మింగిల్‌..!! ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ నాక్కూడా సరిగ్గా తెలియడం లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి, అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పగలను’’ అంటూ నవ్వులు పూయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, సోషల్‌మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌ని అప్పుడప్పుడూ ఫాలో అవుతుంటానని.. వాటిని చూసి నవ్వుకుంటానని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని