Anushka: మరో భాషలో విడుదలకు సిద్ధమైన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’

అనుష్క (Anushka), నవీన్ పొలిశెట్టిల తాజా సూపర్‌ హిట్‌ చిత్రం  ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమా ఇప్పుడు మలయాళంలో విడుదలకు సిద్ధమైంది.

Published : 14 Sep 2023 10:51 IST

హైదరాబాద్‌: తాజాగా విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). అనుష్క (Anushka), నవీన పొలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లో నవ్వులు పూయిస్తోంది. ఇప్పుడీ చిత్రం మలయాళ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. రేపు (సెప్టెంబర్‌ 15) ఈ సినిమాను మలయాళంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్స్‌ను మొదలుపెట్టినట్లు వెల్లడించింది. ఇక మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ‘నెట్‌ఫ్లిక్స్‌’ దక్కించుకుంది. అలాగే శాటిలైట్‌ హక్కులను ‘జీ’ టీవీ సొంతం చేసుకుంది. 

సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో తనయుడితో?

ఇక నేడు (సెప్టెంబర్‌ 14) ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మహిళా ఆడియన్స్ కోసం ఓ ఆఫర్‌ను ప్రకటించింది.  ‘ఈ సినిమా టికెట్‌ పై ఫోన్‌ నంబర్‌ రాసి థియేటర్లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయండి. ప్రతి థియేటర్‌ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు లేడీ ఫ్యాన్స్‌కు అనుష్క ఫోన్‌ చేసి మాట్లాడతారు’ అని మేకర్స్‌ తెలిపారు. అయితే, ఈ ఆఫర్‌ కేవలం సెప్టెంబర్‌ 14న మాత్రమే ఉంటుందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని