Ramesh Babu: ఆ వార్త విని షాకయ్యాను: చిరంజీవి

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్‌బాబు (56) ఆకస్మిక మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు....

Updated : 09 Jan 2022 12:41 IST

సంతాపం ప్రకటించిన ప్రముఖులు

హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్‌బాబు (56) ఆకస్మిక మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రమేష్‌బాబు ఎంతో మంచి వ్యక్తి అంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సోషల్‌మీడియాలో ట్వీట్లు చేశారు.

‘‘రమేష్‌బాబు మరణ వార్త విని షాకయ్యాను. అది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణగారు, మహేశ్‌బాబుతోపాటు కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ - చిరంజీవి

‘‘సహృదయుడు ఘట్టమనేని రమేష్‌బాబు ఆకస్మిక మరణం గుండెల్ని కలచివేసింది. ఆయనకు ఆత్మశాంతి, పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ  కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ - పరుచూరి గోపాలకృష్ణ

‘‘ఘట్టమనేని రమేష్‌బాబు మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - సాయిధరమ్‌ తేజ్‌








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు