Cinema News: ‘సన్న’జాజుల్లా మారి...!

సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఇది ఎంతకాలం ఉంటే అంత బాగా కెరీర్‌ పరుగులు తీస్తుంది. కెరీర్‌ ఆరంభంలో ‘సన్న’జాజిలా నాజూకుగా ఉన్న భామలు...

Updated : 19 Jun 2021 10:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఇది ఎంతకాలం ఉంటే అంత బాగా కెరీర్‌ పరుగులు తీస్తుంది. కెరీర్‌ ఆరంభంలో ‘సన్న’జాజిలా నాజూకుగా ఉన్న భామలు కొందరు తర్వాత బొద్దుగా మారిపోయారు. కొంతకాలానికి తీవ్రమైన   కసరత్తులు చేసి మళ్లీ మెరుపుతీగలా మారుతున్నారు. క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం తీసుకొంటూ... అందచందాలకు మెరుగులు అద్దుకొంటున్నారు. కీర్తిసురేష్, నిత్యామేనన్, ప్రియాంక జవాల్కర్, సురభి, వరలక్ష్మీశరత్‌కుమార్, అవికాగోర్‌ తదితరులు ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్‌కు ముందు వీరంతా బాగా ఒళ్లు చేశారు. లాక్‌డౌన్‌తో చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇలా దొరికిన విరామాన్ని చక్కగా ఉపయోగించుకొని చూడచక్కగా మారిపోయారు. యోగా, వాకింగ్, జాకింగ్, రన్నింగ్, జిమ్‌లో కసరత్తులు... ఇలా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని అందమైన శిల్పాల్లా మారి పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని