National Awards 2023: తెలుగు సినిమా గర్వపడే క్షణమిది: ‘నేషనల్‌ అవార్డ్స్‌’పై ప్రముఖుల హర్షం

69వ జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన వారికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరెవరు ఏమన్నారంటే?

Updated : 24 Aug 2023 21:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటనపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికిగాను ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ (Allu arjun) సొంతం చేసుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. 

ఉత్తమ నటుడిగా నిలిచి జాతీయ చలన చిత్ర అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వరుస అవార్డులు అందుకున్నందుకు సీఎం అభినందనలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 69వ జాతీయ అవార్డులు ఒక బొనాంజా అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నందమూరి బాలకృష్ణ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

  • ‘‘అత్యంత ప్రజాదరణ పొందిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు అవార్డుల పంట పండింది. అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. ఆయనకు నా శుభాకాంక్షలు. ‘పుష్ప’ తెలుగు భాషలోనే కాదు అనేక అంతర్జాతీయ భాషల్లో డబ్బింగ్ చేసి ప్రజాదరణ పొందిన సినిమా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కంగ్రాట్స్‌’. - కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
  • ‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అనేక అవార్డులను సాధించి తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపును తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు. ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాల దర్శక, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు... ఉత్తమ విమర్శకుడుగా ఎంపికైన పురుషోత్తమాచార్యులుకు అభినందనలు’’. - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
  • ‘‘జాతీయ అవార్డులకు ఎంపికైన వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగు సినిమా గర్వపడే క్షణమిది. నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డుకు ఎంపికైన బన్నీ (అల్లు అర్జున్‌)ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’. - చిరంజీవి
  • ‘‘తెలుగు చిత్రాలకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు రావడం హర్షణీయం. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు’’. - పవన్‌ కల్యాణ్‌
  • ‘‘ఇదొక సిక్సర్‌. నేషనల్‌ అవార్డ్స్‌కు ఎంపికైన సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి కంగ్రాట్స్‌. జ్యూరీకి థ్యాంక్స్‌’’. - రాజమౌళి.
  • ‘‘కంగ్రాట్స్‌ అల్లు అర్జున్‌ బావ. ‘పుష్ప’ సినిమాకు పొందే అవార్డులకు నువ్వు అర్హుడువి’’. - ఎన్టీఆర్‌
  • ‘‘కంగ్రాట్స్‌ డియర్‌ అల్లు అర్జున్‌. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించారు’’. - సూర్య.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని