Pawan Kalyan: పవన్‌కు శుభాకాంక్షల వెల్లువ... ‘నువ్వు నా తమ్ముడైనందుకు గర్వంగా ఉంది’ అన్న చిరంజీవి

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ఆయన పుట్టినరోజు (Pawan Birthday) ను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

Updated : 26 Sep 2023 15:16 IST

చిరంజీవి షేర్‌ చేసిన ఫొటో

హైదరాబాద్‌: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఆయన కొత్త సినిమా అప్‌డేట్స్‌తో సందడి నెలకొనగా.. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్‌ చెబుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో పవన్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. పవన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నటీనటులు ఆయనతో గతంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు. 

‘ఓజీ’ వచ్చేశాడు.. గ్లింప్స్‌ చూసేయండి..

  • జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన  హృదయ సేనాని.. నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను.  పుట్టినరోజు శుభాకాంక్షలు కల్యాణ్‌ బాబూ - చిరంజీవి (Chiranjeevi)
  • నా గురువు, చిన్న మామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాకు మాత్రమే కాదు.. కొన్ని లక్షల మందికి మార్గదర్శకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు - సాయి ధరమ్‌ తేజ్‌ (sai dharam tej)
  • పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. - తమిళి సై, తెలంగాణ గవర్నర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని